Song: Enduku Enduku Enduku ..
Singer: Karthik
ఎందుకు ఎందుకు ఎందుకు.. నను పరిగెత్తిస్తావెందుకు ..
ఆకలి తీర్చని విందుకు ..నన్నాకర్షిస్తావెందుకు.. .
దరికి రానీకా ..నింగి శశిరేఖా..
పొదువుకోనీకా ..వొదులుకోనీకా ,,
ఇంతగా చితిమంటలా నన్నంటుకోవాలా ..
సౌందర్యజ్వాలా,, సౌందర్యజ్వాలా.. సౌందర్యజ్వాలా.. సౌందర్యజ్వాలా....... .....
ఎందుకు ఎందుకు ఎందుకు.. నను పరిగెత్తిస్తావెందుకు ..
ఆకలి తీర్చని విందుకు ..నన్నాకర్షిస్తావెందుకు.. . ....
పాల నవ్వుల రూపమా ..నను తాళనివ్వని తాపమా ..దారి చూపని దీపమా ..జత చేరనీయని శాపమా .
పాల నవ్వుల రూపమా ..నను తాళనివ్వని తాపమా ..దారి చూపని దీపమా ..జత చేరనీయని శాపమా .
తళతళతళతళ కత్తులమెరుపై కళ్ళను పొడిచేలా.. తెరవని తలుపై తెలియని మలుపై కలవరపరిచేలా..
నువ్వునా సొంతమనే అత్యాశ అలిసేలా ..నేనెంత ఒంటరినో ఒట్టేసి తెలిపేలా ..
జంట కాని జంటలా నా వెంట నడవాలా ..
సౌందర్యజ్వాలా,, సౌందర్యజ్వాలా.. సౌందర్యజ్వాలా..
ఎందుకు ఎందుకు ఎందుకు.. నను పరిగెత్తిస్తావెందుకు ..
ఆకలి తీర్చని విందుకు ..నన్నాకర్షిస్తావెందుకు.. ..............
నీవు నింపిన ఊపిరే నా గుండె దహిస్తుంటే ఎలా ..నీవు పెంచిన ఆశలే నరనరాన్ని కోస్తుంటే ఇలా ..
నీవు నింపిన ఊపిరే నా గుండె దహిస్తుంటే ఎలా ..నీవు పెంచిన ఆశలే నరనరాన్ని కోస్తుంటే ఇలా ..
సలసలమరిగే నిప్పుల మడుగై నెత్తురు ఉడికేలా...నిలువుననీల ో కరగని కోరిక విలవిలలాడేలా..
ఒక్కపుట్టుకలోనే ఇన్నిన్ని మరణాలా .. ఎంత దగ్గరఉన్నా దక్కని వరమాల ..
నన్నిలా ఉరితాడుతో ఉయ్యాలలూపాలా ..
సౌందర్యజ్వాలా,, సౌందర్యజ్వాలా.. సౌందర్యజ్వాలా.. సౌందర్యజ్వాలా...సౌందర్యజ్ వాలా.........
Song: Dikkulne Daatindhi
Singer: Karthik
ధినకుధినకు దిన్.ధినకుధినకు దిన్.ధినకుధినకు దిన్....
ధినకుధినకు దిన్.ధినకుధినకు దిన్.ధినకుధినకు దిన్....
దిక్కుల్నే దాటింది ఆనందతాండవం .. ఉప్పొంగి దూకింది ఊహల నర్తనం ..
మబ్బుల్నే మీటింది మదిలొనీ మహోత్సవం ..హరివిల్లై విరిసింది ఆశలనందనం ..
మిణుకు మిణుకుమని తళుకులొలుకు తారలతో ఆకాశం ..
చినుకు చినుకులై కరిగి కరిగి దిగివచ్చే నాకోసం ..ఓ హో ||..
దిక్కుల్నే దాటింది ఆనందతాండవం .. ఉప్పొంగి దూకింది ఊహల నర్తనం ..
నలుపొకటే కొలువున్న కనుపాపలో ఇలా ..తొలిసారి ఈవేళా ఇన్నిన్ని వర్ణాలా.
నలుపొకటే కొలువున్న కనుపాపలో ఇలా ..తొలిసారి ఈవేళా ఇన్నిన్ని వర్ణాలా...
తన చెలిమికొనవేలు అందించి ప్రియురాలు నడిపింది తనవైపిలా .
ఈ దివ్యలోకాలు ఈ నవ్యస్వప్నాలు చూపింది నలువైపులా ..
ఎదురై పిలిచే అనురగాలై ఇలకోయిలా ..బదులై పలికే మది వేగాన్ని తెలిపేదేలా .. ఓ హో ||..
దిక్కుల్నే దాటింది ఆనందతాండవం .. ఉప్పొంగి దూకింది ఊహల నర్తనం ..
వడగాలే విడిదైన ఎదలోయలో ఇలా ..పూదోట విరిసేలా పన్నీటి వర్షాలా ..
వడగాలే విడిదైన ఎదలోయలో ఇలా ..పూదోట విరిసేలా పన్నీటి వర్షాలా ..
ఇకపైన ఏనాడు కడలి ఒడిలోకి పడిపోకు అలిసే అలా ..
అని నన్ను ఆపింది ఆ నింగి జాబిల్లి నా చేతికందిందిలా..
వలపే విరిసే అనుబంధాల ఈ సంకెల .. వరదై ఎగసే మధుభావాలు తెలిపేదెలా . ఓ ఓ .. హో ||
దిక్కుల్నే దాటింది ఆనందతాండవం .. ఉప్పొంగి దూకింది ఊహల నర్తనం ..
మబ్బుల్నే మీటింది మదిలొనీ మహోత్సవం ..హరివిల్లై విరిసింది ఆశలనందనం ..
మిణుకు మిణుకుమని తళుకులొలుకు తారలతో ఆకాశం ..
చినుకు చినుకులై కరిగి కరిగి దిగివచ్చే నాకోసం ..ఓ ఓ హో ||..
No comments:
Post a Comment